దహన ‘సంస్కారం’ మరిచిన బంధువులు | Property dispute..Relatives rejects funeral in mahabubabad | Sakshi
Sakshi News home page

దహన ‘సంస్కారం’ మరిచిన బంధువులు

Mar 22 2017 11:56 PM | Updated on Sep 5 2017 6:48 AM

దహన ‘సంస్కారం’ మరిచిన బంధువులు

దహన ‘సంస్కారం’ మరిచిన బంధువులు

ఆస్తి గొడవలతో బంధువులు ఓ మహిళ మృతదేహానికి దహన ‘సంస్కారం’ మరిచారు.

ఆస్తి గొడవలతో మూడు రోజులుగా ఇంటి ముందే శవం

దంతాలపల్లి(డోర్నకల్‌): ఆస్తి గొడవలతో బంధువులు ఓ మహిళ మృతదేహానికి దహన ‘సంస్కా రం’ మరిచారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో మూడు రోజులుగా మృతదేహం ఇంటి ఎదుటే ఉంది. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన కొరిపెల్లి నరేశ్‌రెడ్డి– సునీత(30) దంపతులు. నరేశ్‌రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేక పోవడం తో సునీత కొంతకాలంగా తన కుమారుడు అచ్యుత్‌ తో కలిసి పుట్టిల్లయిన నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెంలో ఉంటోంది. ఈ క్రమం లోనే ఆమె అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మృతి చెందింది.

మృతదేహాన్ని అత్తగారింటికి తరలించిన పుట్టింటివారు నరేశ్‌రెడ్డికి సంబంధిం చిన ఆస్తిని అతడి కుమారుడు అచ్యుత్‌ పేరిట మార్పిడి చేయాలని, అంత్యక్రియలు కూడా నిర్వహించాలని కోరారు. ఆస్తిపై ఎలాంటి నిర్ణయం చెప్పని మృతురాలి దాయాదులు.. ఆమె అంత్య క్రియలు నిర్వహించడానికి కూడా ముందుకు రాలేదు. అంతేగాక నరేశ్‌రెడ్డి సోదరుడు ఆస్తిని ఇవ్వ నంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఇంతవరకు జాడలేకుండా పోయినట్లు స్థానికులు వెల్లడించారు. దీంతో మృతదేహం మూడు రోజులుగా ఇంటి ఆవరణలోనే ఉంటోంది. ఇంటివారెవరూ అందు బాటులో లేకపోవడంతో స్థానికులే అచ్యుత్‌కు భోజనం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement