ఫుట్‌పాత్‌పై పాఠశాల సీజ్..వెంటనే వెనకడుగు | private school seized in banjarahills | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌పై పాఠశాల సీజ్..వెంటనే వెనకడుగు

Jun 17 2015 6:34 PM | Updated on Sep 3 2017 3:53 AM

జూబ్లీహిల్స్ రోడ్ నెం. 24లో మున్సిపల్ పార్కును ఆనుకొని ఫుట్‌పాత్‌పై గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రై వేట్ పాఠశాలను విద్యాశాఖాధికారులు బుధవారం సీజ్ చేశారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 24లో మున్సిపల్ పార్కును ఆనుకొని ఫుట్‌పాత్‌పై గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రై వేట్ పాఠశాలను విద్యాశాఖాధికారులు బుధవారం సీజ్ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు షేక్‌పేట మండల విద్యాశాఖ అధికారులు అక్కడకు చేరుకుని సీజ్ చేశారు. అయితే, తమకు ఈ స్కూల్ తప్పితే అందుబాటులో మరొకటి లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాంతో వారు వెనక్కి తగ్గారు. డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు అప్పటికప్పుడే ఆ పాఠశాలను ప్రభుత్వానికి చెందినదిగా గుర్తించారు. ఇద్దరు ప్రభుత్వ టీచర్లను అపాయింట్ చేశారు. ఇక నుంచి ప్రభుత్వ టీచర్లే ఇక్కడ విద్యార్థులకు పాఠాలు చెప్తారని చెప్పి వెళ్లడం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement