జగ్గారెడ్డిపై ఎచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు..

Private Employees Association Complaint On MLA Jagga Reddy In HRC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మంత్రి హరీష్‌ రావుపై అసభ్యపదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం మంగళవారం ఖండించింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రైవేటు ఉద్యోగ సంఘం నేతలు మండిపడ్డారు. అదేవిధంగా జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశామని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం తెలిపింది.
చదవండి: ‘సభ్యసమాజం సిగ్గుపడేలా జగ్గారెడ్డి మాట్లాడారు’

ఈ సందర్భంగా ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న జగ్గారెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి హరీష్‌రావుపై అనుచిత వాఖ్యలు చేశారని మండిపడ్డారు. జగ్గారెడ్డి తక్షణం హరీష్ రావుకి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై అనుచితన వాఖ్యలు చేస్తే ఉరుకోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. జగ్గారెడ్డి భాష మార్చుకోకపోతే ఆయన ఇంటిముందు ధర్నా చేస్తామనాని గంధం రాములు పేర్కొన్నారు.
చదవండి: కేటీఆర్‌కు భజన చేసుకో.. చెంచాగిరి కాదు..!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top