మూతబడి | Sakshi
Sakshi News home page

మూతబడి

Published Thu, Aug 28 2014 4:19 AM

Primary education in dangerous

కామారెడ్డి:  జిల్లాలోని సర్కారు బడులలో ప్రాథమిక విద్య ప్రమాదంలో పడింది. పాఠశాలలలో మౌలిక సమస్యలు, ఉపాధ్యాయుల కొరత, ఉపాధ్యాయులు ఉన్నచోట కొందరు ‘బెల్లు..బిల్లు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్సులు, చిట్టీల దందాలు, హోటళ్లు, ప్రయివేటు బడులు, ప్రయివేటు కళాశాలలు ఇలా రకరకాల వ్యాపారాలలో మునిగిపోయి విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

దీంతో పభుత్వ విద్యపై తల్లిదండ్రులు విశ్వాసం కోల్పోతున్నారని అంటున్నారు. ఇంగ్లిషు మోజు కూడా పెరుగ డం కూడా విద్యార్థుల సంఖ్య తగ్గడానికి మరో కార ణం. ఫలితంగా సర్కారు బడులు మూసివేత బాటలో నడుస్తున్నాయి. ప్రయివేటు పాఠశాలలలో చదివేవారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో మొత్తం 3,015 ప్రభు త్వ పాఠశాలలు ఉండగా, అందులో 2,31,500 మంది పిల్లలు చదువుతున్నారు.

 835 ప్రయివేటు పాఠశాలల లో 1,95,000 మంది చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో సగటున ఒక్కో పాఠశాలలో 75 మంది చదువుతుంటే, ప్రయివేటు బడులలో సగటు సంఖ్య రెండు వందలకు పైగా ఉంది. ఏటా జిల్లాలో 35 నుంచి 60 వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతబడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజులలో ప్రభుత్వ పాఠశాలల ఉనికి లేకుండాపోతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా
 ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేత బాటలో నడుస్తున్నాయి. యేడాదికేడాది విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. మూడేళ్ల వయస్సున్న పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల లో చేర్పించి, నాలుగేళ్లు దాటితే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో చేర్పించాలి. అయితే మూడేళ్లు దాటిన పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు బదులు కాన్వెంటులకు పం పుతున్నారు.

తమ పిల్లలు ఇంగ్లిషు రైమ్స్ చెబుతుంటే మురిసిపోయే తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాలన్నా, ప్రభుత్వ పాఠశాలలన్నా ఇష్టపడడం లేదు. కొందరు  ప్రభుత్వ ఉపాధ్యాయులు విధుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సొంత వ్యాపకాలలో మునిగి తేలుతున్నారు. కొందరు రోజుల తరబడి బడులకు వె ళ్లకుండానే సంతకాలు చేస్తూ వేతనాలు పొందుతున్నారన్న విమర్శలున్నాయి. దీనికి కొందరు అధికారులు కూడా సహకరిస్తుండడతో విద్యావ్యవస్థ భ్రష్టుప ట్టి ప తోంద ని పలువురు ఆవేదన చెందుతున్నారు.

 పెరిగిన ఇంగ్లిషు మోజు
 ప్రభుత్వ పాఠశాలలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులున్నప్పటికీ, తెలుగు మీడియం చదువులు కావడంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఇంగ్లిషు మీడియం పై పెరిగిన మోజుతో పిల్లలను ప్రయివేటు బడిబాట పట్టిస్తున్నారు. సర్కారు బడులలో ఉన్న ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించి ఇంగ్లీషు బోధించే ప్రయత్నం చేయడానికి ఇష్టపడడం లేదు. కామారెడ్డి ప్రాంతంలోని ఒకటి రెండు పాఠశాలలలో గ్రామస్థుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లిషు మీడియం మొదలుపెట్టా రు. అక్కడ పిల్లలంతా సర్కారు బడులనే ఆశ్రయిస్తున్నారు. దీనికి ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. ఇలా అందరూ ఉపాధ్యాయులు ఆలోచిస్తే సర్కారు బడులకు పూ ర్వవైభవం తీసుకురావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement