వైద్యులు లేరని.. వెళ్లగొట్టారు | Pregnant womens suffering in the kodad government hospital | Sakshi
Sakshi News home page

వైద్యులు లేరని.. వెళ్లగొట్టారు

Mar 31 2017 4:05 AM | Updated on Oct 9 2018 7:52 PM

వైద్యులు లేరని.. వెళ్లగొట్టారు - Sakshi

వైద్యులు లేరని.. వెళ్లగొట్టారు

పురిటినొప్పులతో వచ్చిన ఇద్దరు గర్భిణులను డాక్టర్లు లేరని పంపించిన ఘటన సూర్యా పేట జిల్లా కోదాడ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది.

కోదాడ ప్రభుత్వాస్పత్రిలో పురిటినొప్పులతో గర్భిణుల యాతన

కోదాడ: పురిటినొప్పులతో వచ్చి న ఇద్దరు గర్భిణులను డాక్టర్లు లేరని పంపించిన ఘటన సూర్యా పేట జిల్లా కోదాడ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. మున గాల మండలం తిమ్మారెడ్డి గూడా నికి చెందిన రజని పురిటి నొప్పు లతో  బాధపడుతుండగా బుధవారం రాత్రి కోదాడ వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు.

రజనీకి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో వెంటనే వేరొక వైద్యశాలకు వెళ్లాలని సూచించారు. ప్రైవేట్‌ అంబులెన్స్‌లో సూర్యాపేట వైద్య శాలకు తీసుకెళ్తుండగా ప్రసవించింది. అలాగే, గురువారం కోదాడకు చెందిన మొయిన్‌ తన భార్య నుస్రత్‌ను కాన్పు కోసం వైద్యశాలకు తీసు కొచ్చాడు. డాక్టర్లు లేరని సిబ్బంది చెప్పడంతో ప్రైవేట్‌ ఆస్పత్రిని ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement