హోలీ వేడుకల్లో అపశ్రుతి | Praveen killed in holli sambaralu | Sakshi
Sakshi News home page

హోలీ వేడుకల్లో అపశ్రుతి

Mar 23 2016 10:27 AM | Updated on Sep 3 2017 8:24 PM

ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం టేకులచెరువులో బుధవారం జరిగిన హోలీ సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.

ఖమ్మం : ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం టేకులచెరువులో బుధవారం జరిగిన హోలీ సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రవీణ్ అను 14 ఏళ్ల బాలుడు ప్రమాద వశాత్తూ ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రహదారిపై స్నేహితులతో ప్రవీణ్ హోలీ సంబరాలు చేసుకుంటున్నాడు. ఆ క్రమంలో వేగంగా వస్తున్న ట్రాక్టర్ కింద ప్రవీణ్ పడిపోయాడు. దీంతో ప్రవీణ్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement