ఫైమాతో కటీఫ్.. నటితో నిశ్చితార్థం చేసుకున్న కమెడియన్ | Patas Praveen Engagement With Actress Vamshita | Sakshi
Sakshi News home page

Patas Praveen: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన పటాస్ ప్రవీణ్

May 5 2026 2:24 PM | Updated on May 5 2026 2:36 PM

Patas Praveen Engagement With Actress Vamshita

తెలుగులో రియాలిటీ షోలతో చాలాజంటలు పాపులారిటీ సంపాదించాయి. అలాంటి వాటిలో ప్రవీణ్-ఫైమా జోడీ ఒకటి. కలిసి స్కిట్స్ చేశారు. యూట్యూబ్ వ్లాగ్స్ కూడా చేశారు. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించారు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకుంటారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఫైమా తన జీవితంలో ప్రవీణ్ అనే మరో వ్యక్తి ఉన్నాడని అతడే తన ప్రియుడి అని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఫైమాతో కలిసి నటించిన ప్రవీణ్ విషయానికొస్తే ఇప్పుడు మరో నటితో నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

పలు ఆల్బమ్ సాంగ్స్‌లో చేసిన వంశిత అనే అమ్మాయితో పటాస్ ప్రవీణ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. దీంతో తోటి కమెడియన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలో పెళ్లి వార్త కూడా చెప్పే అవకాశముంది.

ప్రవీణ్ పెళ్లి చేసుకోబోతున్న వంశిత.. బంధువుల అమ్మాయి అని అంటున్నారు. పటాస్ ప్రవీణ్ విషయానికొస్తే చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. నాలుగేళ్ల క్రితం బ్రెయిన్ ట్యూమర్‌తో తండ్రి కూడా చనిపోయాడు. ఇతడికి ఓ అన్న ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు.

(ఇదీ చదవండి: రూ.20 కోట్ల బడ్జెట్.. 'బాహుబలి' రేంజ్ కలెక్షన్స్)

Advertisement
 
Advertisement
Advertisement