ఖమ్మంలో ఘనంగా మోదీ పుట్టినరోజు వేడుకలు | Ponguleti Sudhakar Reddy Celebrates Modi Birthday At Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో ఘనంగా మోదీ పుట్టినరోజు వేడుకలు

Sep 17 2019 2:26 PM | Updated on Sep 17 2019 2:43 PM

Ponguleti Sudhakar Reddy Celebrates Modi Birthday At Khammam - Sakshi

ప్రధాని మోదీతో పొంగులేటి సుధాకర్ రెడ్డి (ఫైల్‌)

సాక్షి, ఖమ్మం: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించి స్పెషల్ ఆఫీసర్లు నియమించి, ప్రయివేటు ఆస్పత్రుల్లో జరిగే దోపిడీని అరికట్టాలని పొంగులేటి అన్నారు.

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతికి పొంగులేటి సంతాపం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో బోటు ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జీతో న్యాయ విచారణ జరపి, ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement