‘మహారాజ ఎక్స్‌ప్రెస్’ వివరాలు ఇవ్వండి | ponguleti srinivasa reddy asked maharaja express details | Sakshi
Sakshi News home page

‘మహారాజ ఎక్స్‌ప్రెస్’ వివరాలు ఇవ్వండి

Apr 28 2015 1:23 AM | Updated on Sep 4 2018 5:16 PM

‘మహారాజ ఎక్స్‌ప్రెస్’ వివరాలు ఇవ్వండి - Sakshi

‘మహారాజ ఎక్స్‌ప్రెస్’ వివరాలు ఇవ్వండి

విలాసవంతమైన మహారాజ ఎక్స్‌ప్రెస్ పర్యాటక రైలు ఆక్యుపెన్సీకి సంబంధించి గడచిన మూడేళ్ల వివరాలను తెలపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం లోక్‌సభలో ప్రశ్నించారు.

సాక్షి, న్యూఢిల్లీ: విలాసవంతమైన మహారాజ ఎక్స్‌ప్రెస్ పర్యాటక రైలు ఆక్యుపెన్సీకి సంబంధించి గడచిన మూడేళ్ల వివరాలను తెలపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం లోక్‌సభలో ప్రశ్నించారు. ఆక్యుపెన్సీతో పాటు ఆదాయ, వ్యయాలను కూడా తెలియచేయాలన్నారు. సామాన్యులు ఆర్థికంగా భరించే విధంగా ఇదే తరహాలో రైలును ప్రవేశపెట్టే ప్రతిపాదనలపై ప్రశ్నించారు.

 

దీనిపై రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా బదులిస్తూ 2012-13, 2013-14, 2014-15 సంవత్సరాల వారీగా ఆక్యుపెన్సీ, ఆదాయం, వ్యయం వివరాలను వెల్లడించారు.  మహారాజ ఎక్స్‌ప్రెస్ తరహాలోనే సామాన్యుల కోసం రైలు ప్రవేశపెట్టే ప్రతిపాదనలేవని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement