టీఆర్‌ఎస్‌ పాలనలో మాఫియాలదే హవా | Pongalati Sudhakar Reddy Fire on TRS govt | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ పాలనలో మాఫియాలదే హవా

Jul 6 2017 2:44 AM | Updated on Sep 17 2018 8:11 PM

టీఆర్‌ఎస్‌ పాలనలో మాఫియాలదే హవా - Sakshi

టీఆర్‌ఎస్‌ పాలనలో మాఫియాలదే హవా

టీఆర్‌ఎస్‌ పాలనలో ఇసుక, కల్తీ, డ్రగ్స్‌ మాఫియాలు రాజ్యమేలు తున్నాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పాలనలో ఇసుక, కల్తీ, డ్రగ్స్‌ మాఫియాలు రాజ్యమేలు తున్నాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్‌ మాఫియాతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినేలా ఉందన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడా రు. ఖమ్మం మార్కెట్‌ యార్డ్‌ తరలింపుపై ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ అప్రజాస్వా మ్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారం ఉందికదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అజయ్‌కు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. మాఫియా రాజ్యమేలడమేనా బంగారు తెలంగాణ అంటే అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా మేలుకుని ఉక్కుపాదంతో ఈ మాఫియాను అణచివేయాలని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement