సాంబరెడ్డికి అమెరికా ఫార్మా సొసైటీ ఫెల్లో.. | Pharmaceutical Society of America Fellow sambareddiki .. | Sakshi
Sakshi News home page

సాంబరెడ్డికి అమెరికా ఫార్మా సొసైటీ ఫెల్లో..

Nov 23 2014 2:13 AM | Updated on Apr 4 2019 3:25 PM

సాంబరెడ్డికి అమెరికా ఫార్మా సొసైటీ ఫెల్లో.. - Sakshi

సాంబరెడ్డికి అమెరికా ఫార్మా సొసైటీ ఫెల్లో..

వరంగల్ జిల్లాకు చెందిన ఫార్మసీ వైద్య శాస్త్రవేత్త, అమెరికాలో టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ ప్రొఫెసర్ సాంబరెడ్డికి ప్రతిష్టాత్మక అమెరికా ఫార్మా సొసైటీ ఫెల్లో(ఏఏపీఎస్) అవార్డు లభించింది.

  • ప్రపంచంలో 15 అత్యంత ప్రతిభావంత శాస్త్రవేత్తల్లో స్థానం
  • వరంగల్: వరంగల్ జిల్లాకు చెందిన ఫార్మసీ వైద్య శాస్త్రవేత్త, అమెరికాలో టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ ప్రొఫెసర్ సాంబరెడ్డికి ప్రతిష్టాత్మక అమెరికా ఫార్మా సొసైటీ ఫెల్లో(ఏఏపీఎస్) అవార్డు లభించింది. మెదడు సంబంధ జబ్బులకు నూతన ఔషధాలు కనుగొనడంలో 20 ఏళ్లుగా పరిశోధనలు చేసి, నరాల వ్యాధులకు చికిత్సలు కనిపెట్టి ప్రపంచ ఫార్మారంగానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్నందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.  

    ఈ బిరుదు అందుకున్న వారిని ప్రపంచంలోని 15 అత్యంత ప్రతిభావంత శాస్త్రవేత్తల్లో ఒకరిగా గౌరవిస్తారు. అమెరికాలోని కాలిఫోర్నియా శాండియాగో నగరంలో నవంబర్ 21న అమెరికా ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్తల సంఘం వార్షిక సమావేశంలో జరిగిన అవార్డు బంకేట్‌లో అమెరికా ఫార్మా అధ్యక్షురాలు డాక్టర్ మేరిలిన్ మెర్రిస్ ఈ అవార్డును సాంబరెడ్డికి ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement