ప్రజలు మూఢ నమ్మకాలు వీడాలి

People Should Live to Superstitious Beliefs - Sakshi

జైపూర్‌ ఏసీపీ సీతారాములు

చెన్నూర్‌రూరల్‌ : మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు మూఢ నమ్మకాలను వీడా లని జైపూర్‌ ఏసీపీ సీతారాములు అన్నారు. మండలంలోని ఆస్నాద గ్రామంలో శనివారం రాత్రి కమిషనరేట్‌ పరిధిలో మూడ నమ్మకాలపై, రోడ్డు ప్రమాదాలపై, మద్యం తాగితే కలిగే నష్టాలు, ర్యాగింగ్, బాల్యవివాహలు, గల్ఫ్‌ మోసాలు, రైతుల అత్మహత్యలు వివిధ రకాల సమస్యల గురించి నాటకాల రూపంలో కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులకు సహకరించొద్దన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆన్నారు. యువత చెడు వ్యసనాల జోలికిపోవద్దన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా జేపీవో దృషికి తెస్తే పరిష్కరిస్తారన్నారు. గ్రామంలో మద్యం బెల్ట్‌ షాపులను నిర్వహించొద్దని సూచించారు. చెన్నూర్‌ పట్టణ సీఐ కిశక్షర్, సర్పంచ్‌ కొల్లూరి బుచ్చమ్మ, లచ్చన్న, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top