అభివృద్ధి కోసమే పార్టీ మార్పు 

 Party Change For  Mla Athram Sakku - Sakshi

 కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు

అభివృద్ధి కోసమే పార్టీని వీడుతున్నట్లు వెల్లడి

సాక్షి, తిర్యాణి: ఆసిఫాబాద్‌ నియోజక వర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీ నుంచి మారాల్సి వస్తుంద ని ఆసిఫాబాద్‌  ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను  పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించారు. డిసెంబర్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీకి అఖండ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో  గిరిజన ప్రాంతాలలో ఆభివృద్ధి విషయమై చర్చించామన్నారు.

గిరిజన ప్రాంతాలలో విద్య, వైద్యం, భూమి సమస్యలు కొకొల్లలుగా ఉన్నాయ ని వాటిని పరిష్కరించాలని కోరగా గిరిజన ప్రాంత అభివృద్ధికి తాము కోరిన విధంగా చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట ఇచ్చారని, కేసీఆర్‌ ఇచ్చిన హామీతోనే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నామన్నారు.  నియోజకవర్గం, మండలాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు సూ చించారు. గతంలో టీఆర్‌ఎస్‌లో పార్టీ లో ఉన్న కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు.  ఇందు లో భాగంగా మండలంలో పర్యటించానని కార్యకర్తల అభిప్రాయాలను పంచుకున్నామన్నారు.

తాము టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడానికి విధివిధానాలు రూపొందించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పుడంటే అపుడే పార్టీలో చేరతామన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పార్టీ నాయకులు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సక్కు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని కలిసి çపని చేస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జువ్వాజి అనిల్‌గౌడ్, జెడ్పీటీసీ వెడ్మకమల, సింగిల్‌ విండో చైర్మన్‌ చుంచు శ్రీనివాస్, సర్పంచ్‌ సింధూజ, ఉపసర్పంచ్‌ తోట లచ్చయ్య, రిటైర్ట్‌ ఎంఈవో శంకర్, నాయకులు తోట భీమయ్య, పెరుమాండ్ల వెంకటేశం, గాజంగి మల్లేశ్, బుర్రరమేశ్, బ్రహ్మం, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top