ప్యాంటుకు ప్రత్యేక పాకెట్స్‌! | pants Specially pockets illegal transport gold | Sakshi
Sakshi News home page

ప్యాంటుకు ప్రత్యేక పాకెట్స్‌!

Mar 24 2017 3:25 AM | Updated on Sep 5 2017 6:54 AM

దుబాయ్‌ నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేయడానికి నిర్ణయించుకున్న వ్యక్తి తెలివిగా వ్యవహరిం చాడు. తన ప్యాంటుకు ప్రత్యేకంగా జేబులు ఏర్పాటు చేయించుకున్నాడు.

బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ఏర్పాటు
 విమానాశ్రయంలో 952 గ్రాముల బంగారం స్వాధీనం


సాక్షి, హైదరాబాద్‌: దుబాయ్‌ నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేయడానికి నిర్ణయించుకున్న వ్యక్తి తెలివిగా వ్యవహరిం చాడు. తన ప్యాంటుకు ప్రత్యేకంగా జేబులు ఏర్పాటు చేయించుకున్నాడు. వాటిలో 952 గ్రాముల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో సర్ది తీసుకువచ్చాడు.  సమాచారం అందుకున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ), కస్టమ్స్‌ ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ దాడి చేసి   పట్టుకున్నాయి.

దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ విమానంలో వచ్చిన స్మగ్లర్‌ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగాడు. ఇతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు తనిఖీ చేసి ప్యాంటు లోపలి భాగంలో ఏర్పాటు చేసుకున్న రహస్య జేబులు గుర్తించారు. వాటిలో ఉన్న 952 గ్రాముల బరువున్న 9 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీని రూ.27.9 లక్షలుగా నిర్ధారించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement