సచివాలయంలో మంత్రి ‘పల్లె’కు గాయం | Palle raghunatha reddy injured his leg | Sakshi
Sakshi News home page

సచివాలయంలో మంత్రి ‘పల్లె’కు గాయం

Dec 11 2014 1:24 AM | Updated on Sep 2 2017 5:57 PM

సచివాలయంలో మంత్రి ‘పల్లె’కు గాయం

సచివాలయంలో మంత్రి ‘పల్లె’కు గాయం

సచివాలయంలోని తన కార్యాలయంలోని టేబుల్ తగలడంతో సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాలికి గాయమైంది.

సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని తన కార్యాలయంలోని టేబుల్ తగలడంతో సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాలికి గాయమైంది. కాలు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడున్న సిబ్బంది మంత్రిని హుటాహుటిన నిమ్స్‌కు తరలించారు. సచివాలయం నుంచిబయటకు వస్తుండగా మంత్రి కుడికాలుకు టేబుల్ తగిలింది. నిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు అత్యవసర చికిత్సలు అందించారు.ఆయనను సహచర మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు ఫోన్‌లో పరామర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement