ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో ప్రధాన రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
కొణిజర్ల : ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో ప్రధాన రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురూ గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉద్యోగులే. భద్రాచలంలో పనిచేస్తున్న డీఈ పి.నవీన్, ఏఈలు సాయికుమార్, పరమేశ్ సోమవారం కారులో ఖమ్మం వైపు వెళుతున్నారు.
కొణిజర్ల దాటిన తర్వాత వీరి కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. తర్వాత అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ముత్తయ్య (40) మృతి చెందగా, కారులో ఉన్న డీఈ, ఏఈలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.