22 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ | on june 22nd Certificate verification | Sakshi
Sakshi News home page

22 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

Jun 10 2016 4:42 AM | Updated on Apr 7 2019 3:35 PM

22 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - Sakshi

22 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి తెలిపారు.

ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి
చౌటుప్పల్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులోని అశోకా ఇంజనీరింగ్  కళాశాలలో గురువారం జాబ్ మేళాను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసి, జూలై మొదటి వారంలో మొదటి విడత కౌన్సెంగ్‌ను, రెండో వారంలో రెండో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామన్నారు.

ఆగష్టు 15వ తేదీ నుంచి కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో విజిలెన్సు తనిఖీలు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని చెప్పారు. ఏఐసీటీఈ నిబంధనల మేరకు నడుపుతున్న కళాశాలలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ సమావేశంలో జేఎన్‌టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ జగ్‌మోహన్‌దాస్, కళాశాల చైర్మన్ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement