కర్నూలుకు ఓబులేసు తరలింపు | Obulesu in four day banjara hills police custody | Sakshi
Sakshi News home page

కర్నూలుకు ఓబులేసు తరలింపు

Nov 25 2014 9:02 AM | Updated on Aug 21 2018 5:46 PM

కేబీఆర్ పార్క్ కాల్పుల కేసులో నిందితుడు ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు కర్నూలు తరలించారు.

హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల కేసులో నిందితుడు ఓబులేసును బంజారాహిల్స్  పోలీసులు కర్నూలు తరలించారు. న్యాయస్థానం అనుమతితో అతడిని అయిదు రోజులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కాల్పులకు ఉపయోగించిన ఏకే-47ను దాచిన ప్రదేశమైన కర్నూలులోని ఓర్వకల్లుకు ఓబులేసును పోలీసులు తీసుకువెళ్లారు. కాల్పుల అనంతరం ఓబులేసును పోలీసులు కర్నూలులోనే అరెస్ట్ చేసిన విషయం విదితమే.

ఈనెల 19న అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఓబులేసు కాల్పులకు పాల్పడ్డాడు. కాగా నార్సింగిలోని ఓబులేసు ఇంటి నుంచి ఖాళీ తూటాలను పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. ఈ తూటాలు గ్రేహౌండ్స్లో చోరీ చేసిన ఏకే-47వేనా లేక ఇతర ఆయుధానివా అనే విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement