18వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌  | Sakshi
Sakshi News home page

18వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ 

Published Wed, Jan 17 2018 7:29 PM

notification to issue 18000 cops posts

జగిత్యాల: రాష్ట్రంలో18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ స్టేషన్‌ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామన్నారు. 

Advertisement
 
Advertisement