'ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే' | NO DSC notification in short period, says kadiam srihari | Sakshi
Sakshi News home page

'ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే'

Jun 28 2015 5:54 PM | Updated on Jul 11 2019 5:07 PM

'ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే' - Sakshi

'ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే'

తెలంగాణలో ఇప్పట్లో డీఎస్సీ పరీక్ష నిర్వహించడం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

గండీడ్ (రంగారెడ్డి):  తెలంగాణలో ఇప్పట్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆయన ఆదివారం రంగారెడ్డి జిల్లా గండీడ్ లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం టీచర్ల పదోన్నతులు, బదిలీలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తోన్న వారిపై తెలంగాణ ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది.

Advertisement
 
Advertisement
Advertisement