30 ఏళ్లుగా అదే రుచి..

No Change In Quality Of Food From 30 Years In Bhainsa, Nirmal - Sakshi

సాక్షి, భైంసా(ముథోల్‌) : భైంసాలో ఇప్పటికీ గడ్డెన్న ఆఫీసుగా చెప్పుకునే ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి వచ్చే కార్యకర్తలకు ఆనవాయితీగా అటుకులు, పేలాలే టిఫిన్‌గా అందించడం కొనసాగుతోంది. ముథోల్‌ గడ్డపై చెరగని ముద్ర వేసుకున్న గడ్డెన్న కాకా వారసత్వం కొనసాగుతోంది. దివంగత గడ్డెన్న ఆరుసార్లు రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. గడ్డెన్న బతికున్నంతకాలం ఇక్కడి వారంతా కాకా అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయన ఉన్న ప్రతిరోజు ఇక్కడికి వచ్చే కార్యకర్తలందరికీ అల్పాహారాలు తినిపించి, యోగక్షేమాలు తెలుసుకుని పంపేవారు. 

సలీం చేతిలో..
సలీం.. ఈ పేరు ముథోల్‌ నియోజకవర్గంలో అందరికీ చూపరిరిచితం. దివంగత గడ్డెన్న మన మధ్యలేక పదిహేనేళ్ల కాలం గడుస్తోంది. గడ్డెన్న బతికున్నంతకాలం అక్కడికి వచ్చేవారికి ఆయన వంట మనిషి సలీం అటుకులు, పేలాలు తాళింపు వేసి సిద్ధంగా ఉంచేవారు. తన వద్దకు వచ్చిన అనుకూలురైనా, వ్యతిరేకులైనా ఉదయం వేళ వస్తే టిఫిన్, రాత్రి వేళ వస్తే భోజనం చేయించి పెట్టేవారు.

ముథోల్‌ నియోజకవర్గ ప్రజలు గడ్డెన్న కాకా అభిమానులు పట్టణానికి ఏ పని కోసం వచ్చినా ఇక్కడి గడ్డెన్న కాకా ఆఫీసులో టిఫిన్‌ చేసి వెళ్లేవారు. 2004 ఏప్రిల్‌ 20న గడ్డెన్న కాకా మరణ అనంతరం ఆయన కుమారులు విఠల్‌రెడ్డి, సూర్యంరెడ్డిలు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

30 ఏళ్లుగా..
ముప్పయ్యేళ్లుగా అప్పుడు, ఇçప్పుడు అదే సలీం వంట మనిషిగా ఉన్నారు. గడ్డెన్న కాకా బతికున్న సమయంలోనూ విఠల్‌రెడ్డి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పడు సలీ మే వంట మనిషిగా ఉన్నాడు. ముప్పయ్యేళ్ల నుంచి ఒకే రుచితో అటుకులు, పేలాలు అల్పాహారాన్ని తయారు చేసి పెడుతున్నాడు. కాకా అభిమానులు ఆయన కార్యకర్తలు సలీం చేతి అటుకులు, పేలాలుతినేందుకే ఇష్టపడుతుం టా రు. రుచికరమైన అటుకులు, పేలాలు తినేం దు కు గడ్డెన్న కాకా ఆఫీసుకు వస్తుంటారు. అప్ప ట్లో గడ్డెన్న వద్ద ఇప్పట్లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి వద్ద వంట మనిషిగా పని చేస్తున్న సలీం ఎలాం టి అహంభావం లేకుండా సదాసీదాగా ఉంటాడు.

ఇప్పటికీ  ఆ కుటుంబమే..
ఈ కుటుంబం వద్దే పనిచేయాలని అనిపిస్తుంది. గడ్డెన్న సాబ్‌ జమానా నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. ఎంతోమంది పిల్లలు అప్పట్లో తండ్రులతో కలిసి ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడంతా రాజకీయ నాయకులుగా ఎదిగి మండల స్థాయి పదవులు చేస్తున్నారు. గడ్డెన్న కాకా దివంగతులయ్యాక విఠల్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా నేను వంటమనిషిగానే ఉన్నాను. వంటమనిషిలా కాకుండా కుటుంబ సభ్యునిగా చూసుకునే గడ్డిగారి ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్నిరోజులైనా ఇక్కడే వంటమనిషిగా కొనసాగుతాను. 
– సలీం, వంటమనిషి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top