ఆ డాక్టరు ఇక లేరు

NIMS doctor lost her battle for life after cardiac arrest in London  - Sakshi

నిమ్స్ ప్రొఫెసర్ మీనాకుమారి కన్నుమూత

లండన్‌ సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలిన మీనా కుమారి

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస

లండన్‌: అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన నిమ్స్ సీనియర్ ఫిజీషియన్ మీనా కుమారి తుది శ్వాస విడిచారు. లండన్‌ సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలిన నిమ్స్ ప్రొఫెసర్ అక్కడ ఉపన్యసిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన సంగతి విదితమే. అంత్యత విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరిన ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసిన యూకే డిప్యూటి హై కమిషనర్‌ డా.ఆండ్రూ ఫ్లెమింగ్‌ ఆమె కుటుంబానికి, సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఈ అనూహ్య ఘటనతో ఆమె కుటుంసభ్యులు, నిమ్స్‌ వైద్యులు, ఆసుపత్రి సిబ‍్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

లండన్‌లో ఓ సదస్సులో ప్రసంగిస్తూ నిమ్స్ సీనియర్ న్యూరో ఫిజీషియన్‌ గుండెపోటుతో కుప్పకూలారు. నిమ్స్ ఆస్పత్రి న్యూరో విభాగంలో సీనియర్ ఫిజీషియన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఏ​కే మీనాకుమారి న్యూరో సదస్సులో పాల్గొనడానికి ఇటీవల లండన్ వెళ్లారు. అక్కడ సదస్సులో ఉపన్యసిస్తుండగా ఆమెకు తీవ్ర గుండెపోటుగు గురైనారు. కాగా తమిళనాడుకు చెందిన మీనాకుమారి గాంధీ ఆస్పత్రి నుంచి ఆమె ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను పూర్తి చేశారు. నిమ్స్‌లో 25 ఏళ్లుగా సేవలందిస్తున్న మీనాకుమారి ప్రత్యేక గుర్తింపును సాధించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top