తెలంగాణలో పెరిగిన మద్యం రేట్లు ఇవే.. | New Liquor Prices in Hyderabad, Telangana | Wine Shops Open - Sakshi Telugu
Sakshi News home page

తెలంగాణలో పెరిగిన మద్యం రేట్లు ఇవే..

May 6 2020 10:10 AM | Updated on May 6 2020 11:49 AM

New Liquor Prices In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా తెలంగాణలో మద్యం షాపులు బుధవారం ఉదయం 10 గంటలకు తెరుచుకున్నాయి. దాదాపు 45 రోజుల తర్వాత వైన్స్‌ తెరుచుకోవడంతో.. మందుబాబులు షాపుల ముందు క్యూ కట్టారు. చాలా మంది వినియోగదారులు క్యూ లైన్లలో భౌతిక దూరం పాటిస్తున్నారు. అయితే నేటి నుంచి మద్యం విక్రయాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్‌.. చీప్‌ లిక్కర్‌పై 11 శాతం, మద్యంపై 16 శాతం ధర పెంచుతున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకారం కొత్త మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి. కాగా, తెలంగాణలో 2,200 మద్యం దుకాణాలకు గానూ కంటైన్మెంట్‌ జోన్లలోని 15 దుకాణాలు మినహాయించి మిగిలిన వాటిని ఓపెన్‌ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు సాగనున్నాయి. 

పెరిగిన ధరలు.. 
ప్రతి బీర్‌పై రూ. 30 పెంపు
చీప్‌ లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌పై రూ. 40 పెంపు
ఆర్డినరి లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌పై రూ. 80 పెంపు
ప్రీమియం లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌పై రూ. 120 పెంపు
స్కాచ్‌ లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌పై రూ. 160 పెంపు

చదవండి : ఆ ప్రాంతాలు మినహా అన్నిజోన్లలో మద్యం విక్రయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement