మాంసం దుకాణాలకు కొత్త రూల్స్‌  | New Guidelines For Meat Shop | Sakshi
Sakshi News home page

మాంసం దుకాణాలకు కొత్త రూల్స్‌ 

May 16 2020 2:34 PM | Updated on May 16 2020 2:34 PM

New Guidelines For Meat Shop - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోడి, మేక, చేపల మాంసం దుకాణాలు వ్యర్థాలను రోడ్లపై పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖ హెచ్చరించింది. పట్టణాల్లో మాం సం దుకాణాలన్నింటినీ గుర్తించి వాటికి సం బంధించిన వ్యర్థాల సమీకరణ, తరలింపునకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఆదేశించారు. పశు వధశాలల వ్యర్థాలను బయో మెథనేషన్‌ ప్రక్రియ ద్వారా అక్కడికక్కడే నిర్వీర్యం చేయాలని సూచించారు. మాంసం దుకాణదారులందరూ తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
 

  • దుకాణంలో లీక్‌ ప్రూఫ్‌ చెత్తబుట్టలుండాలి
  • పనిముట్లు, కంటైనర్లను క్రమం తప్పకుం డా వేడి నీళ్లతో కడగాలి
  •  నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి, డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలి
  • వర్కర్లు అప్రాన్‌లు, హెడ్‌గేర్, గ్లౌజులను తప్పనిసరిగా ధరించాలి
  • ఫినాయిల్, బ్లీచింగ్‌ పౌడర్‌ వంటి కీటక నివారిణిలను క్రమం తప్పకుండా దుకాణ ప్రాంగణంలో చల్లాలి. దుకాణంలో వీటిని లభ్యంగా ఉంచుకోవాలి.  
  • కార్మికులకు చర్మవ్యాధులు ఉండరాదు, గోళ్లు పెంచుకొని ఉండరాదు  
  • ఈగలు ఉండరాదు
  • బాలకార్మికులతో పని చేయించుకోరాదు
  • ఏవైనా ఉల్లంఘనలుంటే వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా మున్సిపల్‌ అధికారుల పేర్లతో దుకాణంలో బోర్డు ఏర్పాటు చేయాలి.
  • రోజుకు టన్ను కంటే ఎక్కువ మొత్తంలో మాంసం వ్యర్థాల ఉత్పత్తి ఉంటే బయో మెథనేషన్‌ ప్రక్రియ ద్వారా వీటిని నిర్వీ ర్యం చేయాలి
  • అంత కంటే తక్కువ ఉంటే అత్యంత లోతుగా పూడ్చి వేయాలి
  • మాంసం వ్యర్థాలతో ఎరువుల తయారీకి అవకాశం ఉంటే పరిశీలన జరపాలి. ఇలా తయారైన ఎరువులను హరితహారం కోసం వినియోగించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement