తత్కాల్‌ పాస్‌పోర్టులో కొత్త విధానం | A new approach to Tatkal passport | Sakshi
Sakshi News home page

తత్కాల్‌ పాస్‌పోర్టులో కొత్త విధానం

Jan 29 2018 6:22 PM | Updated on Sep 4 2018 5:37 PM

A new approach to Tatkal passport - Sakshi

పాస్‌పోర్ట్‌ అధికారి విష్ణువర్ధన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : తత్కాల్‌ పాస్‌పోర్టులో కొత్త విధానం ప్రవేశపెట్టినట్లు పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల ధృవీకరణ లేకుండానే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆధార్‌ కార్డు, సెల్ఫ్‌ డిక్లరేషన్‌, రెండు గుర్తింపు పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. మూడు రోజుల్లోనే పాస్‌పోర్టు లభిస్తుందని అన్నారు.

సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో 2017లో జారీ అయిన పాస్‌పోర్ట్ వివరాలను వెల్లడించారు. పాస్‌పోర్టులు జారీ చేయడంలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం మొదటి స్ధానంలో ఉందని తెలిపారు. త్వరలోనే తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, మెదక్, సిద్దిపేట, అదిలాబాద్‌లలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement