ఇంగ్లిష్, హిందీల్లోనే జేఈఈ మెయిన్స్‌

The National Testing Agency (NTA) SaysThat JEE Main Exams Conducted In Language Requested by states - Sakshi

అడిగిన రాష్ట్రాలకే ఆయా భాషల్లో జేఈఈ మెయిన్స్‌

ఏ భాషలో ప్రశ్నపత్రం ఇచ్చినా ప్రామాణికం ఇంగ్లిషే: ఎన్‌టీఏ

సాక్షి, హైదరాబాద్‌: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే నిర్వహిస్తున్నామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్‌ ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు అంగీకరించిన, తమ ప్రాంతీయ భాషలో పరీక్షను నిర్వహించాలని కోరిన రాష్ట్రాల భాషల్లో మాత్రమే (ఇంగ్లిష్, హిందీతోపాటు) జేఈఈ మెయిన్స్‌ నిర్వహి స్తున్నామని తెలి పింది. 2013లో జేఈఈ మెయిన్స్‌ ప్రారంభమయ్యాక గుజరాతీలో పరీక్ష నిర్వహిం చాలని గుజ రాత్‌ కోరిందని తెలిపింది. 2014లో మహారాష్ట్ర కూడా మరాఠీతోపాటు ఉర్దూలో పరీక్ష నిర్వహించాలని కోరిందని పేర్కొంది. దాంతో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్స్‌ ప్రశ్న పత్రం ఇస్తున్నామని వెల్లడించింది. మిగతా రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల్లో ప్రశ్న పత్రం ఇవ్వాలని తమను అడగలేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్‌ ప్రశ్నపత్రం ఏ భాషలో ఇచ్చినా మూల్యాంకనంలో మాత్రం ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని వెల్లడించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top