ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఆత్మహత్య | narayankhed rtc depot manager commits suicide | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఆత్మహత్య

Jun 27 2017 11:12 AM | Updated on Nov 6 2018 8:08 PM

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నారాయణఖేడ్‌: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్టీసీ డిపో మేనేజర్‌ మహేందర్‌ మంగళవారం ఉదయం రోడ్డుపై శవమై కనిపించారు. ఆయన పక్కనే పురుగుల మందు డబ్బా కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మహేందర్‌ రెండు రోజులుగా సెలవులో ఉన్నారు. కరీంనగర్‌-2 డిపోలో పనిచేసి పదోన్నతిపై మే నెలలో నారాయణ ఖేడ్‌ కు వచ్చారు.
 
సోమవారం కరీంనగర్‌ నుంచి వచ్చిన ఆయన తన జీపు డ్రైవర్‌కు కొడుకు ఫోన్‌ నెంబరు ఇచ్చారని, మధ్యాహ్నం డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌కు తన సెల్‌ఫోన్‌ అప్పగించాడని చెబుతున్నారు. ఈ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మహేందర్‌ రోడ్డుపై పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ ద్వారా మహేందర్‌ గా గుర్తించారు. అతని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మహేందర్‌ స్వస్థలం కరీంనగర్‌.

Advertisement
 
Advertisement
Advertisement