సైనికుడి అనుమానాస్పద మృతి | nallagonda army jawan died at kolkata | Sakshi
Sakshi News home page

సైనికుడి అనుమానాస్పద మృతి

May 3 2015 9:03 PM | Updated on Sep 3 2017 1:21 AM

సైనికుడు కాగా లింగస్వామి (ఫైల్ ఫొటో)

సైనికుడు కాగా లింగస్వామి (ఫైల్ ఫొటో)

కోల్‌కతాలో ఆర్మీలో పని చేస్తున్న మిర్యాలగూడ మండలం తడకమళ్ల వాసి అనంతుల లింగస్వామి పెళ్లికార్డులు పంచడంకోసం కోల్కతా వెళ్లి అనుమానాస్పదరీతిలో ఆదివారం శవమయ్యాడు.

కోల్‌కతాలో ఆర్మీలో పని చేస్తున్న మిర్యాలగూడ మండలం తడకమళ్ల వాసి అనంతుల లింగస్వామి పెళ్లికార్డులు పంచడంకోసం కోల్కతా వెళ్లి అనుమానాస్పదరీతిలో ఆదివారం శవమయ్యాడు. కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. తడకమళ్ల గ్రామానికి చెందిన అనంతుల వెంకయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఆరుగురు సంతానం కాగా లింగస్వామి(25) ఒక్కడే మగ పిల్లవాడు. అతడు ఎనిమిదేళ్లుగా 206 ఫీల్డ్ కంపెనీలోని 20వ ఇంజినీరింగ్ సెగ్మెంటులో పని చేస్తున్నాడు.. కాగా, శనివారం రాత్రి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. అయితే, లింగస్వామి ఆదివారం తెల్లవారు జామున చనిపోయాడని అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కాగా, నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామానికి చెందిన ఓ యువతితో లింగస్వామి వివాహం ఈనెల 22వ తేదీన జరగాల్సి ఉంది. దీంతో అతడు గత నెల 30వ తేదీన పైఅధికారులతో పాటు స్నేహితులకు పెళ్లి కార్డును ఇవ్వడానికి కోల్‌కతా వెళ్లి మృతి చెందాడు.అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement