కశ్మీర్‌ ప్రమాదంలో ఏపీ జవాన్‌ వీరమరణం.. సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం

AP Jawan Rajasekhar Dies In Kashmir Road Accident - Sakshi

సంబేపల్లె: కశ్మీర్‌ లోయలో బస్సు పడిన ఘటనలో అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం దేవపట్లకు చెందిన  జవాన్‌ దేవరింటి రాజశేఖర్‌ (35) మృతి చెందినట్లు బంధువులకు సమాచారం అందింది. బద్రీనాథ్‌ బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తున్న ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) బస్సుకు మంగళవారం ప్రమాదం జరిగి ఏడుగురు మృతిచెందిన విషయం పాఠకులకు తెలిసిందే. 

ఈ ఘటనలో జవాన్‌ రాజశేఖర్‌ మృతి చెందినట్లు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. డి.చిన్నయ్య, రాములమ్మల పెద్దకుమారుడు అయిన రాజశేఖర్‌ ఐటీబీపీలో 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. రాజశేఖర్‌కు భార్య ప్రమీల, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

వీర జవాన్ల మృతిపై సీఎం సంతాపం
సాక్షి, అమరావతి: విధినిర్వహణలో వీరమరణం పొందిన ఐటీబీపీ జవాన్‌ అన్నమయ్య జిల్లా దేవపట్టకు చెందిన డి. రాజశేఖర్‌ అతని సహచరుల మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు.

ఇది కూడా చదవండి: అర్థం చేసుకోండి.. ప్రతి పథకానికీ ఒక అర్థం.. పరమార్థం ఉన్నాయి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top