తమ్మినేని క్షమాపణ చెప్పాలి | nalla malla reddy demand for sorry for cpm Allegations | Sakshi
Sakshi News home page

తమ్మినేని క్షమాపణ చెప్పాలి

Feb 11 2017 2:57 AM | Updated on Aug 13 2018 8:12 PM

తన పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పత్రికాముఖంగా తనకు క్షమాపణ చెప్పాలని...

విద్యా సంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి డిమాండ్‌
సాక్షి, హైదరాబాద్‌: తన పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పత్రికాముఖంగా తనకు క్షమాపణ చెప్పాలని ప్రముఖ విద్యాసంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. సింగరేణి కార్మికుల సొమ్ముతో విద్యావ్యాపారం చేస్తున్నట్లు, ప్లాట్లను అభివృద్ధి చేస్తానని డబ్బులు వసూలు చేసి ఆ పని చేయకుండా, ప్లాట్లు అమ్ముకోనీ యకుండా దౌర్జన్యం చేస్తున్నట్లు తమ్మినేని చేసిన ఆరోపణలను శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించారు.

తాను విద్యావ్యాపారం చేయడం లేదని, కష్టార్జితంతో విద్యాసంస్థలు నెలకొల్పి, పార్టీలలో ఇమడలేక స్యతంత్రంగా తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాని మల్లారెడ్డి చెప్పారు. ప్రభుత్వానికి భారం లేకుండా తన ఆస్తులను మదింపు చేసుకునేందుకు స్వయంగా తమ్మినేనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దివ్యానగర్‌ ప్లాట్లలో సింగరేణి ఉద్యోగుల కంటే ఎక్కువగా ఇతర సంస్థల ఉద్యోగులు, వ్యక్తులున్నారని పేర్కొన్నారు. యజమానులు తమ ప్లాట్లు అమ్ముకోకుండా తాను అడ్డుపడలేదని, ప్రైవేట్‌ సైన్యంతో ప్లాట్లు అమ్ముకునే వారిని వేధిస్తున్నామని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement