breaking news
nalla Malla Reddy
-
తమ్మినేని క్షమాపణ చెప్పాలి
విద్యా సంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తన పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పత్రికాముఖంగా తనకు క్షమాపణ చెప్పాలని ప్రముఖ విద్యాసంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సొమ్ముతో విద్యావ్యాపారం చేస్తున్నట్లు, ప్లాట్లను అభివృద్ధి చేస్తానని డబ్బులు వసూలు చేసి ఆ పని చేయకుండా, ప్లాట్లు అమ్ముకోనీ యకుండా దౌర్జన్యం చేస్తున్నట్లు తమ్మినేని చేసిన ఆరోపణలను శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించారు. తాను విద్యావ్యాపారం చేయడం లేదని, కష్టార్జితంతో విద్యాసంస్థలు నెలకొల్పి, పార్టీలలో ఇమడలేక స్యతంత్రంగా తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాని మల్లారెడ్డి చెప్పారు. ప్రభుత్వానికి భారం లేకుండా తన ఆస్తులను మదింపు చేసుకునేందుకు స్వయంగా తమ్మినేనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దివ్యానగర్ ప్లాట్లలో సింగరేణి ఉద్యోగుల కంటే ఎక్కువగా ఇతర సంస్థల ఉద్యోగులు, వ్యక్తులున్నారని పేర్కొన్నారు. యజమానులు తమ ప్లాట్లు అమ్ముకోకుండా తాను అడ్డుపడలేదని, ప్రైవేట్ సైన్యంతో ప్లాట్లు అమ్ముకునే వారిని వేధిస్తున్నామని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. -
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలి
సీపీఎం కార్యదర్శి తమ్మినేని సాక్షి, హైదరాబాద్: కార్మికుల సొమ్ముతో విద్యా వ్యాపారం చేస్తున్న నల్ల మల్లారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సీపీఎం కార్యదర్శి తమ్మినేని విజ్ఞప్తి చేశారు. ఘట్కేసర్ సమీపంలోని కాచవాని సింగారంలో సింగరేణి కార్మికులు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయగా, వాటి డెవలప్మెంట్ చార్జీల నిమిత్తం నల్ల మల్లారెడ్డి డబ్బులు వసూలు చేసి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఎవరైనా ప్లాట్ అమ్ముకునేందుకు వెళితే ప్రైవేట్ సైన్యంతో వేధింపులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వ యంత్రాంగం నుంచి కనీస స్పందన కరువైందన్నారు. ఆక్రమించుకున్న ప్లాట్లను యజమానులకు తిరిగి అప్పగించాలని కోరారు. మల్లారెడ్డి, ఆయన రియల్ ఎస్టేట్ సంస్థపై వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు.