
కాంగ్రెస్‌లో ఐక్యతా రాగం!
రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఐక్యతారాగం వినిపించింది. ఉప్పు, నిప్పులా ఉండే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సీనియర్ అయిన జానారెడ్డి ఒక్క చోట చేరారు.
► నల్లగొండ వేదికగా జానా, ఉత్తమ్, కోమటిరెడ్డి భేటీ
►2009 తర్వాత తొలిసారి కోమటిరెడ్డి ఇంటికి ఉత్తమ్
►ముగ్గురూ కలసి భోజనం.. రాజకీయ మంతనాలు
సాక్షి, నల్లగొండ: రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఐక్యతారాగం వినిపించింది. ఉప్పు, నిప్పులా ఉండే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సీనియర్ అయిన జానారెడ్డి ఒక్క చోట చేరారు. నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఈ ముగ్గురు నేతలు కలసి భోజనం చేశారు. మంతనాలు చేశారు. కోమటిరెడ్డి ఇంటికి ఉత్తమ్ రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ 2019లో అ«ధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కలిసుండాలనే సంకేతాలివ్వడం గమనార్హం.
ఇన్నాళ్లు ఎడమొహం.. పెడమొహమే
కీలకమైన టీపీసీసీ చీఫ్, సీఎల్పీ నేత పదవు ల్లో ఉన్న ఉత్తమ్, జానారెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాత నల్లగొండ జిల్లాకు చెందినవారే. 2009 తర్వాత కోమటిరెడ్డి మంత్రి అయిన నాటి నుంచి విభే దాలు మొదలయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కోమటిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఉత్తమ్‌కు మంత్రిగా అవకాశం లభించడం లాంటి ఘటనలు అంతరాన్ని మరింత పెంచాయి. గతంలో హుజూర్‌నగర్ పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి వర్గీయులకు, ఉత్తమ్ వర్గీయులకు బాహా బాహీ కూడా జరిగింది. ఉప్పు, నిప్పులా ఉండే నేతలిద్దరూ ఇప్పుడు కలిసిపోవడం.. ఏడేళ్ల తర్వాత ఉత్తమ్ కోమటిరెడ్డి నివా సానికి రావడం, తో కలసి రాజకీయ చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.