'పోలీస్ బందోబస్తు మధ్య ఎన్ఎస్పీ క్వార్టర్స్ ఖాళీ' | Nagarjuna Sagar Project quarters on the brink | Sakshi
Sakshi News home page

'పోలీస్ బందోబస్తు మధ్య ఎన్ఎస్పీ క్వార్టర్స్ ఖాళీ'

Jul 11 2014 10:01 AM | Updated on Sep 2 2017 10:09 AM

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్ఎస్పీ) క్వార్టర్స్లో అనధికారికంగా నివసిస్తున్న మాజీ ఉద్యోగులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

నల్గొండ : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్ఎస్పీ) క్వార్టర్స్లో అనధికారికంగా నివసిస్తున్న మాజీ ఉద్యోగులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. శుక్రవారం ఉదయం అధికారులు ...పోలీసు బందోబస్తు మధ్య ఖాళీ చేయిస్తున్నారు. కాగా నాగార్జున సాగర్‌ నిర్మాణ సమయంలో ఉద్యోగుల సౌలభ్యం కోసం ఎన్ఎస్పీ క్వార్టర్స్‌ నిర్మించారు. అయితే కాలక్రమేణా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు లీజు పేరుతో వాటిని ఆక్రమించుకున్నారు.

దీనిపై 2009లో లోకాయుక్తలో కేసు నమోదైంది. గతేడాది ఆగస్టు 1న ఉపలోకాయుక్త కృష్ణాజీరావు క్వార్టర్స్‌ను పరిశీలించారు. కలెక్టర్‌, ఎస్పీ, సాగర్‌ చీఫ్‌ ఇంజినీరుతో కమిటీ ఏర్పాటు చేశారు. క్వార్టర్స్‌ వ్యవహారంపై సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. లోకాయుక్త ఆదేశాలు బేఖాతరు చేసిన అప్పటి జిల్లా ఎస్పీకి అరెస్ట్‌ వారెంట్‌ సైతం జారీచేశారు. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఫలితంగా గత ఏడాది మార్చి 20న మొదటి విడతగా పదిమంది రాజకీయ నాయకుల క్వార్టర్స్‌ను ఖాళీ చేయించారు. కాగా మిగిలిన క్వార్టర్స్ లో ఉన్న మాజీ ఉద్యోగులను ఇవాళ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement