కాళేశ్వరంపై నాగ్‌, రవితేజ ఆసక్తికర ట్విట్స్‌ | Nagarjuna And Ravi Teja Tweets On Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై నాగ్‌, రవితేజ ఆసక్తికర ట్విట్స్‌

Jun 21 2019 3:06 PM | Updated on Jul 21 2019 4:48 PM

Nagarjuna And Ravi Teja Tweets On Kaleshwaram Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టుకు నిర్మించినందుకుగాను సీఎం కేసీఆర్‌పై వివిధ వర్గాల ప్రముఖులు ప్రశంసలు కురిపిసున్నారు. తాజాగా టాలీవుడ్‌ హీరోలు అక్కినేని నాగార్జున, రవితేజ ట్వీటర్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘నీరే ప్రపంచానికి జీవం. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ప్రారంభించినందుకు శుభాకాంక్షలు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అద్భుత ప్రతిభకి నిదర్శనం’ అని ట్విట్‌ చేయగా.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల ప్రతిభకి నిదర్శనం. ఇంత గొప్ప ప్రాజెక్టును నిర్మించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు అభినందనలు’ అని రవితేజ ట్విట్‌ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధిన ఫోటో షేర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement