గూగుల్ ప్లేస్టోర్‌లో ‘మై టీఎస్‌పీఎస్సీ’ యాప్ | "My TSPSP 'App in the Google Play Store | Sakshi
Sakshi News home page

గూగుల్ ప్లేస్టోర్‌లో ‘మై టీఎస్‌పీఎస్సీ’ యాప్

Nov 9 2016 2:02 AM | Updated on Sep 4 2017 7:33 PM

గూగుల్ ప్లేస్టోర్‌లో ‘మై టీఎస్‌పీఎస్సీ’ యాప్

గూగుల్ ప్లేస్టోర్‌లో ‘మై టీఎస్‌పీఎస్సీ’ యాప్

పరీక్ష కేంద్రాలకు గ్రూపు-2 అభ్యర్థులు సులభంగా చేరుకునేలా రూట్ మ్యాప్ చూపించే ‘మై టీఎస్‌పీఎస్సీ’ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది.

పరీక్ష కేంద్రాల వివరాలు అప్‌డేట్ కానందున ఆవిష్కరణ వారుుదా

 సాక్షి, హైదరాబాద్: పరీక్ష కేంద్రాలకు గ్రూపు-2 అభ్యర్థులు సులభంగా చేరుకునేలా రూట్ మ్యాప్ చూపించే ‘మై టీఎస్‌పీఎస్సీ’ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. అన్ని పరీక్ష కేంద్రాల సమాచారం, లాంగిట్యూట్, లాట్యిట్యూడ్ సమాచారంతో మ్యాప్‌లు అప్‌డేట్ కాకపోవడంతో మంగళవారం యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించలేదు. అరుుతే గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం యాప్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం 1,600 కేంద్రాలరూట్ మ్యాప్‌లను యాప్‌లో అందుబాటులోకి తెచ్చారు. మరో 300కు పైగా కేంద్రాల సమాచారాన్ని బుధవారం ఉదయం వరకు పొందుపరిచేందుకు టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. కాగా, ఇతర పోటీ పరీక్షలకూ యాప్‌ను వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.  

 యాప్‌లో ఏమున్నాయంటే..
 ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో టీఎస్‌పీఎస్సీ ఐడీని అభ్యర్థి తెలుసుకోవచ్చు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన వివరాలు ఫొటోతో పాటు చూసుకోవచ్చు. హాల్‌టికెట్ వివరాలు పొందొచ్చు. హాల్‌టికెట్ నెంబరు సహాయంతో పరీక్ష రాయబోయే కేంద్రానికి రూట్ మ్యాప్ పొందేలా యాప్ అభివృద్ధి చేశారు. సమస్యలుంటే సంప్రదించేందుకు హెల్ప్ డెస్క్, టెక్నికల్ టీం నంబర్లు కూడా యాప్‌లో అందుబాటులో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement