మా అన్నే నాకు హీరో : ఎంపీ కవిత

My Brother Is My Hero Says MP Kavitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ నిజామాబాద్‌ : ‘మా అన్న కేటీఆర్‌ నాకు హీరో.. ఆయనే నా ఇన్స్పిరేషన్‌’ అని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన ఐటీహబ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ మంత్రి, తన సోదరుడు కేటీఆర్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జిల్లాలోని విద్యార్థుల భవిష్యత్‌ కోసమే ఐటీహబ్‌ను నిర్మిస్తున్నామన్నారు. వాట్సప్‌ లాంటి ఆవిష్కరణలు పుట్టింది సామాన్యుల ఆలోచనలనుంచేనని, నిజామాబాద్‌ ఐటీలో అలాంటి ఆవిష్కరణలు కచ్చితంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘మేం వచ్చే ఎన్నికల కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తున్నాం​. ఐటీ హబ్‌లో టాస్క్‌ ప్రోగ్రామ్‌తో విద్యార్థులకు మార్గదర్శనం లభిస్తుంది. దీనిలో భాగస్వామ్యం అవుతున్న ఎన్‌ఆర్‌ఐలకు కృతజ్ఞతలు. జిల్లాలో మహిళల కోసం ప్రత్యేకంగా స్టేడియంలు నిర్మిస్తున్నాం. రూ. 25 కోట్లతో ప్రత్యేక బస్‌ టెర్మినల్‌ ఏర్పాటు చేస్తున్నాం. డిజిటల్‌ లైబ్రరీ స్థాయిని పెంచుతాం. తెలంగాణ వచ్చాక ప్రజలే కేంద్ర బిందువుగా పాలన సాగుతోంది. భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని అందరూ అలవర్చుకోవాలి. నిజామాబాద్‌లో కళాశాలల విద్యార్థుల సంఖ్య ఎంతో అన్ని మొక్కలు నాటాలి. మొక్కలు నాటి  నా ట్విటర్‌ అకౌంట్‌కి ట్యాగ్‌ చేయాలి’ అని  విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top