డెంగ్యూతో కార్మికుడు మృతి | Municipal contract worker dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో కార్మికుడు మృతి

Oct 24 2015 5:44 PM | Updated on Oct 16 2018 7:27 PM

వనపర్తి మునిసిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గోర్ల చిన్న మన్యం(42) శుక్రవారం రాత్రి డెంగ్యూతో మృతిచెందాడు.

వనపర్తి టౌన్ (మహబూబ్‌నగర్ జిల్లా) : వనపర్తి మునిసిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గోర్ల చిన్న మన్యం(42) శుక్రవారం రాత్రి డెంగ్యూతో మృతిచెందాడు. మన్యానికి రెండు నెలల కిందట డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. దసరా పండుగకు ఇంటికి వెళదామని పట్టుబట్టడంతో రెండు రోజుల క్రితం వనపర్తికి తీసుకొచ్చారు. కాగా శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. అతడికి భార్య చెన్నమ్మ, ముగ్గురు కొడుకులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement