
సాక్షి, హైదరాబాద్ : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను నిజామాబాద్ ఎంపీ కవిత సోమవారం కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో ఐటీ పార్క్ ఏర్పాటు చర్చించారు. భేటీ అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ రూ.50 కోట్లతో నిజామాబాద్‌లో ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ 60 ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయని, వచ్చే దసరాకు ఐటీ పార్క్ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిజామాబాద్ ఐటీ పార్క్‌తో ఉత్తర తెలంగాణకు మేలు చేకూరుతుందన్నారు. అలాగే పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని కవిత పేర్కొన్నారు.
Soon NZB will have an IT hub. Telangana Govt. has directed TSIIC to identify the land for the construction. @KTRTRS @TelanganaCMO pic.twitter.com/wWTchIVOSP
— Kavitha Kalvakuntla (@RaoKavitha) 9 October 2017