‘మోత్కుపల్లి’.. మానసిన వికలాంగుడు | Sakshi
Sakshi News home page

‘మోత్కుపల్లి’.. మానసిన వికలాంగుడు

Published Sun, Aug 17 2014 2:51 AM

‘మోత్కుపల్లి’.. మానసిన వికలాంగుడు

నల్లగొండ  :టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మానసిక వికలాంగుడిగా మారారని, తెలంగాణ  రాష్ట్రంలో ఉంటూనే తెలంగాణ  ద్రోహిగా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  గతంలో రాజ్యసభ సీటు కోసం.. ప్రస్తుతం ఏపీలో నామినేటెడ్ పదవి కోసం చాలా రోజుల తర్వాత చంద్రబాబు మెప్పుపొందేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని అన్నారు.
 
 లోయర్ సీలేరులో పీపీఎ రద్దు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణా రైతులపై ప్రేమ ఉంటే చంద్రబాబుతో మాట్లాడి విద్యుత్ ఇప్పించే విధంగా ప్రయత్నించాలని హితవు పలికారు. రైతులకు రుణమాఫీ చేస్తుంటే చేయడం లేదని, ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తుంటే మోత్కుప ల్లికి కానరావట్లేదా.. అన్ని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మైనం శ్రీనివాస్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి, ఆ పార్టీ నాయకులు బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, శివరామకృష్ణ, జమాల్‌ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement