మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం వెంకటాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది.
నారాయణ్‌ఖేడ్: మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం వెంకటాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తల్లి, ఇద్దరు కూతుళ్లు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కూతురు మృతి చెందగా, తల్లి, మరో కూతురు ప్రాణాలతో పోరాడుతున్నారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
అయితే వీరేందుకు ఆత్మహత్యాయత్నం చేశారో తెలియరాలేదు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.