కమల్‌నాథన్ కమిటీ సిఫారసుల్లో లోపాలున్నాయని టీజీవో సంఘం వ్యవస్థాపకుడు, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: కమల్‌నాథన్ కమిటీ సిఫారసుల్లో లోపాలున్నాయని టీజీవో సంఘం వ్యవస్థాపకుడు, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఉద్యోగుల వినతులు అంగీకరించకపోవడం సరికాదన్నారు. తెలంగాణ మునిసిపల్ కమిషనర్ల సంఘం రూపొందించిన నూతన సంవత్సర డైరీని మంగళవారం ఆయన రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుల కార్యాలయంలో ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మునిసిపల్ కమిషనర్ల సేవలకు సరైన గుర్తింపు లభించలేదన్నా రు. ఉద్యోగుల విభజన ముగిసిన వెంటనే పురపాలక శాఖ ఉద్యోగులకు పదోన్నతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.