నిజాంపేట్‌లో అదృశ్యమైన విద్యార్థులు క్షేమం | Missing Students Were Unharmed | Sakshi
Sakshi News home page

నిజాంపేట్‌లో అదృశ్యమైన విద్యార్థులు క్షేమం

Dec 22 2019 1:03 PM | Updated on Dec 22 2019 1:34 PM

Missing Students Were Unharmed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజాంపేట్‌లో అదృశ్యమైన విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. భాష్యం పాఠశాలకు చెందిన ముగ్గరు విద్యార్థులు శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్ళారు. పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులు సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎల్లంపేట ఆలయం వద్ద విద్యార్థులను గుర్తించిన స్థానికులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థుల ఆచూకీ లభించడంతో  తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement