breaking news
unharmed
-
నిజాంపేట్‌లో అదృశ్యమైన విద్యార్థులు క్షేమం
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్‌లో అదృశ్యమైన విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. భాష్యం పాఠశాలకు చెందిన ముగ్గరు విద్యార్థులు శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్ళారు. పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులు సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎల్లంపేట ఆలయం వద్ద విద్యార్థులను గుర్తించిన స్థానికులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థుల ఆచూకీ లభించడంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఠాక్రేపై హత్యాయత్నం చేశాం!
ముంబై దాడుల కేసులో నిందితుడు... ఇటీవల అప్రూవర్ గా మారిన పాక్ ఆమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఈ రోజు కోర్టుకు మరిన్ని వివరాలు వెల్లడించాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గతంలో అనేకసార్లు హెడ్లీని విచారించిన ముంబై న్యాయస్థానం తాజాగా మరోమారు విచారణ చేపట్టింది. శివసేన వ్యవస్థాపకుడు బాల ఠాక్రేని చంపేందుకు ఓ వ్యక్తి ఉగ్రవాద దుస్తులు ధరించి ప్రయత్నించాడని, ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని, అయితే అతడు ఆ తర్వాత కస్టడీ నుంచి తప్పించుకు పారిపోయాడని తాజా విచారణలో భాగంగా డేవిడ్ కోల్మన్ హెడ్లీ కోర్టుకు తెలిపాడు. తన పర్యవేక్షకుడు సాజిద్ మీర్ సూచనల మేరకు తాను కూడా శివశేన నాయకుడ్ని చంపే లక్ష్యంతో రెండుమార్లు సేనా భవన్ సందర్శించానన్నాడు. ఠాక్రేను లష్కరే తాయిబా ఎందుకు చంపాలనుకుందో తనకు తెలియకపోయినా.. చంపడమే లక్ష్యం కావడంతో ప్రయత్నం మాత్రం చేశానని క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో హెడ్లీ వెల్లడించాడు. అమెరికన్ చట్టాల్లో ప్రాధేయపడిన వారికి క్షమాభిక్ష పెట్టడం అనేది లేదని, మీరు క్షమించినా లేకపోయినా నేరాన్ని కోర్టు ముందు అంగీకరించి ప్రాధేయపడుతున్నానని హెడ్లీ కోర్టుకు వివరించాడు. ముంబై కోర్టుకు తాను వాగ్మూలం ఇవ్వడం ద్వారా అమెరికా విట్నెస్ ప్రొటెక్షన్ లో తనకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నాడు. అంతేకాక తాను అమెరికా పాస్‌పోర్టులో పేరు మార్చుకునేందుకు అక్కడి అధికారులకు ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వలేదని హెడ్లీ స్పష్టం చేశాడు.