చౌటుప్పల్‌ గురుకులానికి మిస్‌ వరల్డ్‌ అమెరికా  | Miss World America to Choutuppal | Sakshi
Sakshi News home page

చౌటుప్పల్‌ గురుకులానికి మిస్‌ వరల్డ్‌ అమెరికా 

Aug 14 2018 1:31 AM | Updated on Aug 14 2018 1:31 AM

Miss World America to Choutuppal - Sakshi

విద్యార్థినులతో కలసి సందడి చేస్తున్న క్లారిసా బోవర్‌

చౌటుప్పల్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని బాలికల గురుకుల పాఠశాలను సోమవారం మిస్‌ వరల్డ్‌ అమెరికా–2017 క్లారిసా బోవర్‌ సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యంతో బాధపడే చిన్నారుల కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. అందులో భాగంగా చౌటుప్పల్‌ గురుకుల పాఠశాలను సందర్శించారు.

విద్యార్థినులతో కలసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా చిన్నారులకు సేవ చేస్తానని తెలిపారు. అలాగే యుద్ధాల్లో గాయపడ్డ సైనికులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement