నల్గొండ జిల్లా డిండి మండలం కందుకూరు గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
డిండి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా డిండి మండలం కందుకూరు గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పొలం పనులకు వెళుతున్న బాలికను వెంబడించిన అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అనిల్ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. రమేష్ అనే మరో యువకుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.