క్షుద్రపూజల పేరుతో.. మైనర్పై అఘాయిత్యం | minor girl rapped in nalgonda over Occult rituals | Sakshi
Sakshi News home page

క్షుద్రపూజల పేరుతో.. మైనర్పై అఘాయిత్యం

Feb 18 2017 4:47 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లాలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.

నార్కెట్‌పల్లి: నల్లగొండ జిల్లాలో ఘోర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షుద్రపూజలు చేస్తే భారీగా డబ్బు వస్తుందని నమ్మించి ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిపిన ఘటన నార్కెట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

నార్కెట్‌పల్లి మండలం బాజకుంట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని(16)ని జాతకం బాగుందని.. ఆమెతో క్షుద్ర పూజలు చేయిస్తే భారీ మొత్తంలో నగదు లభిస్తుందని నమ్మించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ సాయంతో బాలికను తీసుకెళ్లిన వ్యక్తి ఆమెను ముందు తిరుమలగిరి తీసుకెళ్లి.. అనంతరం అక్కడి నుంచి నార్కెట్‌పల్లి మండలంలోని నెమ్మాని గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బంధించి నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తండ్రి సాయంతో శనివారం నార్కెట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. ఈ సంఘటనతో నెమ్మాని ఎంపీటీసీ భర్త వెంకన్నతో పాటు మరో ముగ్గురికి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement