‘ఆ అపవాదును తెలంగాణ చెరిపేసింది’ | Sakshi
Sakshi News home page

వారి బాధలు మాకు తెలుసు

Published Fri, Apr 24 2020 6:06 PM

Ministers Harish Rao, KTR Switch On Ranganayaka Sagar Project Siddipet - Sakshi

సాక్షి,సిద్ధిపేట: సిద్దిపేటను గోదావరి జలాలు ముద్దాడాయి. సిద్దిపేట జిల్లా సరిహద్దుకు చేరిన గోదారమ్మను శుక్రవారం మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌  టన్నెల్‌ పంపు సెట్‌ స్వీచ్‌ ఆన్‌ చేసి రంగనాయక సాగర్‌లోకి నీళ్లను వదిలారు. రిజర్వాయర్‌లోకి నీళ్లు రాగానే మంత్రులు జలహారతి పట్టారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ ....‘ఈ రోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు,  తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత ఆనందపడ్డానో అంత ఆనందంగా ఉంది. సిద్దిపేటకు గోదావరి నీళ్లు అనేది దశాబ్దాల కల. ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ దేశానికి దారి చూపింది. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్దాల నిర్మాణం అన్న దశ నుంచి రెండు, మూడు ఏళ్ళల్లోనే నిర్మించవచ్చని తెలంగాణ చూపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన  కూలీలను  మేము మర్చిపోలేం. ఈ ప్రాంతం ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, వలసల జిల్లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ రెండు పంటలు పండించుకోవచ్చు. నాడు పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, నేడు గోదావరి జలాలతో  పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. ఒక ప్రజాప్రతినిదిగా ఇంతకంటే మధురానుభూతి మరొకటి లేదు’ అని పేర్కొన్నారు. (ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలి)

అదేవిధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమల నిర్మాణం చేపట్టాల్సిందిగా, ఐటి హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను  హరీష్‌రావు కోరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... ‘ఒక చిరస్మరనీయమైన ఘట్టంలో భాగస్వాములమయ్యే భాగ్యం మాకు లభించింది.  సిద్దిపేట ప్రజలు ధన్యజీవులు. తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంతం నుంచే వచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే దశాబ్దాల పాటు నిర్మించేవన్న అపవాదును పారద్రోలుతూ.. కాలంతో పోటీ పడుతూ నాలుగైదు ఏళ్లలోనే ప్రాజెక్టులు నిర్మించవచ్చని నిరూపించాం. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కాబోతుంది. దేశానికే ఆదర్శవంతమైన రెండో హరిత విప్లవం ద్వారా అభివృద్ధి బాటలో నడుస్తున్నాం. కాళేశ్వరం ద్వారా కొత్త ఆయాకట్టే కాకుండా యస్‌ఆర్‌యస్పీ కాలువను సైతం పరిపుష్టం చేయబోతున్నాం. సిద్దిపేట అభివృద్ధిని చూసి రాష్ట్రం అసూయ పడుతోంది. ఇక్కడికి ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వస్తాయి. ఐటి హబ్ కూడా వస్తుంది’ అని అన్నారు. అదేవిధంగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల రైతాంగానికి డిస్ట్రిబ్యూషన్ కాలువల నిర్మాణానికి ముందుకు రావాలి అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. భూనిర్వాసితుల బాధలు తమకు తెలిసినంతగా ఎవరికి తెలియవు అని కేటీఆర్‌ పేర్కొన్నారు. (నర్సమ్మ కోసం కేటీఆర్కు ట్వీట్!)

Advertisement

తప్పక చదవండి

Advertisement