
తలసాని శ్రీనివాస్ యాదవ్
సాక్షి, నల్లగొండ : మత్స్యకారుల కుటుంబాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం జిల్లాలోని డిండిలో సమావేశమయ్యారు. అంతేకాక చేపల పెంపకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కులవృత్తులు గ్రామాల్లో సంతోషంగా జీవిస్తారని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అందరికి ప్రోత్సహకాలు అందిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం విజయవంతం అయిందని తెలిపారు. వచ్చే వానకాలంలో మళ్ళీ గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలుపెడుతామని మంత్రి చెప్పారు. మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అయ్యారు. వొచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లను గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ వారు పుట్టగతులు లేకుండా పోతారని జోస్యం మంత్రి తలసాని జోస్యం చెప్పారు.