నేనూ ఛోటాభీమ్‌ ఫ్యాన్నే..: కేటీఆర్‌ | Minister KTR comments on Chota Bheem | Sakshi
Sakshi News home page

May 7 2018 6:10 PM | Updated on Aug 30 2019 8:24 PM

Minister KTR comments on Chota Bheem - Sakshi

హెచ్‌ఐసీసీ: ఛోటాభీమ్‌ సీరియల్‌ పది సంవత్సరాల వేడుకల్లో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఛోటా భీమ్‌ అంటే తెలియని పిల్లలు ఉండరు. ఓ కార్టూన్‌ చానెల్‌లో ప్రసారమైన ఛోటా భీమ్‌ సీరియర్‌ పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటూ.. కిడ్‌ సూపర్‌హీరోగా పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నగరంలోని హెచ్‌ఐసీసీలో సోమవారం ఛోటాభీమ్‌ సీరియల్‌ పది సంవత్సరాల సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఛోటా భీమ్‌కు తాను కూడా అభిమానినేనని తెలిపారు. ఇలాంటి కార్టూన్స్‌ పాత్రలతో పిల్లలకు యానిమేషన్‌ రంగంపై ఆసక్తి కలుగుతుందని చెప్పారు.  ఛోటా భీమ్‌ పాత్ర ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా  చాలా ప్రాంతాలలో ప్రాచుర్యం పొందిందన్నారు.

యానిమేషన్ ఇండస్ట్రీ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని తెలిపారు. ప్రతి సోమవారం అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని ఆయన కోరారు. గేమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ యానిమేషన్ రంగానికి  ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. దీనికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద ఇమేజ్‌ టవర్స్ ను హైదరాబాద్‌లో నిర్మిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement