పార్లమెంట్‌ ఎన్నికల్లో ‘మధ్య’ ఓట్లే కీలకం!

Middle Aged Voters Are Important In Parliament Elections - Sakshi

30 నుంచి 59 ఏళ్లలోపు ఓటర్లు 12,19,180 

తొలిసారి ఓటు వినియోగించుకోనున్న వారు 48,519 మంది

వయసుల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేసిన అధికారులు 

ఆదిలాబాద్‌అర్బన్‌: ఏప్రిల్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మధ్య వయస్కుల ఓట్లే కీలకం కా నున్నాయి. ఇప్పటికే అధికారులు వయసుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. 18 ఏళ్ల యువ ఓటర్ల నుంచి 79 ఏళ్ల వయస్సు గల వారు, 80 ఏళ్లకుపైబడిన వృద్ధులు జాబితాలో ఎంత మంది ఉన్నారనేది స్పష్టంగా లెక్కతీశారు. ఉమ్మ డి జిల్లాలో గత డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం లోక్‌సభ ఎన్నికలకు ఓటర్ల జాబితా రూపకల్పన కోసం గత డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 10 వర కు ఓటరు నమోదును నాలుగు జిల్లాలో చేపట్టా రు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రూపొం దిం చిన ఓటర్ల జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో 20,63,963 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 10,20,320 మంది ఉండగా, మహిళలు 10,43,552 మంది ఉన్నారు. ఇతరులు 91 మంది ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 20,63,963 మంది ఓట ర్లు ఉన్నారు. ఇందులో 30 ఏళ్ల వయసు నుంచి 59 ఏళ్ల మధ్య వయసు వారు 12,19,180 మంది ఉండగా, 18 నుంచి 29 ఏళ్ల వయసు గల యువ ఓటర్లు 5,97,276 మంది ఉన్నారు. 60 నుంచి 79 ఏళ్ల వయసు గల వృద్ధ ఓటర్లు 2,26,047 మంది ఉండగా, 80 ఏళ్లకుపైబడిన వృద్ధులు 21,460 మంది ఉన్నట్లు జాబితాలో స్పష్టంగా ఉంది. ఇక 18, 19 ఏళ్ల వయసు గల వారు కొత్తగా ఓటరు జాబితాలో నమోదయ్యారు. ఈ లెక్కన 48,519 మంది యువకులు కొత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న వయస్సుల వారీగా ఓటర్లతో పోల్చుకుంటే ఈ సారి ఎక్కువగా నమోదయ్యాయి.

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు నాలుగు జిల్లాల అధికార యంత్రాంగం గత రెండు నెలలుగా సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఎన్నికల సి బ్బంది, అధికారుల నియామకం, పోలింగ్‌ కేం ద్రాల్లో సౌకర్యాల కల్పన, ఈవీఎంలు, పోలింగ్‌ సామగ్రిని సమకూర్చుకుంటున్న అధికారులు మ రోవైపు ఓటర్ల తుది జాబితాను కూడా రెడీ చేశా రు. కాగా, ఓటరు జాబితా ప్రకారం చూ స్తే.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మధ్య వయస్కులు, యువత ఓట్లు కీలకం కానున్నాయి. జా బితాలో 52 శాతం మంది మధ్య వయస్కులు ఉండగా, 25 శాతం యువ ఓటర్లు ఉండడం ఇక్కడడంతో అభ్యర్థుల గెలుపు వీరి చేతుల్లో ఉందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించి ఆదిలాబాద్‌ నుంచి పార్లమెంట్‌కు ఎవరిని పంపాలన్నది ఆ ఇద్దరి చేతుల్లోనే ఉంది. ఓ టు హక్కు ద్వారా నేతల తలరాతలను మార్చుతారో.. లేదో చూడాలంటే ఏప్రిల్‌ 11 దాకా ఆగాల్సిందే. 

నాలుగు జిల్లాల్లో వయసుల వారీగా ఓటర్లు ఇలా..

వయసు   కుమురంభీం   మంచిర్యాల  ఆదిలాబాద్‌  నిర్మల్‌ 
 18 నుంచి 19      9,438    12,185    8,916   17,987
 20 నుంచి 29  1,09,037  1,46,308  1,14,080 1,79,235
30 నుంచి 39 1,02,264  1,53,305   1,10,100   1,78,053
40 నుంచి 49  79,481  1,16,485   77,462  1,28,886
50 నుంచి 59 52,875 83,340  52,248  84,681
60 నుంచి 69  30,493 47,032 29,235  49,492
70 నుంచి 79 13,098  20,721 13,574 22,402
80 నుంచి ఆపైన 4,420  5,925  3,726   7,389  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top